విద్యుత్ అక్రమాలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి కీలక వ్యాఖ్యలు - ఏమ్మన్నారంటే? - BJP MLA KVR COMMENTS - BJP MLA KVR COMMENTS
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 5:58 PM IST
BJP MLA KVR on Electricity Debate : విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం అవినీతి చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, పారదర్శకంగానే వ్యవహరించామని బీఆర్ఎస్ చెబుతోందని, ఈ విషయంలో హౌస్ కమిటీ వేసి విద్యుత్ అక్రమాలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని ఆయన కోరారు. సభలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను రాజకీయాలకు కొత్తకాదని కానీ సభకు మాత్రమే కొత్తగా వచ్చానని కాటిపల్లి పేర్కొన్నారు. కొత్త సభ్యులు సీనియర్ సభ్యుల నుంచి నేర్చుకునేలా సభ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సభలో విద్యుత్ రంగంపై జరుగుతున్న చర్చలో బీజేపీ నుంచి వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. సభ జరుగుతున్న తీరు చూస్తుంటే విమర్శలు ప్రతి విమర్శలకే సరిపోతోందన్నారు. రైతులకు కావాల్సిన కరెంట్ సామాగ్రి అందడంలేదన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు తప్పితే, ఎలక్ట్రిక్ డిపోలు ఏర్పాటు చేయలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.