వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం: సిద్ధార్థ్ నాథ్ సింగ్ - Siddharth Manifesto Interview - SIDDHARTH MANIFESTO INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 4:05 PM IST
BJP Leader SiddharthNath Singh Alliance Manifesto Interview: ఏపీలో ఎన్డీఏ కూటమితో కూడిన డబుల్ ఇంజన్ సర్కారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి చూపుతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ అన్నారు. ఎన్డీయే తన మ్యానిఫెస్టోను జాతీయ స్థాయిలో ప్రకటించిందని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలసి పోటీ చేస్తున్న చోట అక్కడ మ్యానిఫెస్టోల్లో బీజేపీ భాగస్వామి కావడం లేదని సిద్ధార్థనాథ్‌సింగ్ స్పష్టం చేశారు. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఇక్కడ టీడీపీ -జనసేన మాత్రమే సంయుక్తంగా మ్యానిఫెస్టోను విడుదల చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ తరఫున తాను స్వయంగా హాజరయ్యానంటేనే మ్యానిఫెస్టోకు తమ పార్టీ పూర్తి సమ్మతి ఉందని అర్థమని ఆయన వివరించారు.
ఉమ్మడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని, మిగతా రాష్ట్రాల కంటే ఏపీ నుంచి ఎన్డీయే అత్యధిక స్థానాలు గెలుస్తుందని తెలిపారు. భాగస్వామ్య పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభివృద్ధి, సంక్షేమ అంశాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు మద్యపాన నిషేధం మొదలుకొని గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలోని చాలా అంశాలను పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని సిద్ధార్ధ్ నాథ్ సింగ్ వెల్లడించారు.