జగన్కు మేలు చేసేందుకే షర్మిల డ్రామాలు: సత్యకుమార్ - బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 7:49 AM IST
BJP Leader Satya Kumar Comments on Party Alliances: తెలుగుదేశం పార్టీతో పొత్తు, సీట్ల అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అది పూర్తిగా అధిష్ఠానం చేతిలోనే ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ పొత్తు, సీట్ల అంశంపై వస్తున్న వార్తల్లో ఏవీ నిజాలు కావని స్పష్టం చేశారు. త్వరలోనే అమిత్షా దీనిపై ప్రకటన చేస్తారని అప్పుడే అందరికీ నిజాలు తెలుస్తాయన్నారు. మరోవైపు షర్మిల, కేవీపీలపై సత్యకుమార్ విమర్శలు చేశారు. ఈ పదేళ్లలో ఎప్పుడూ లేనిది వారికి ఇప్పుడు ఏపీ గుర్తుకొచ్చిందా అని నిలదీశారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్కు మేలు చేసేందుకే ఈ కుటుంబ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ ఓడిపోతే విదేశాలకు పారిపోతాడని ఎద్దేవా చేశారు. అప్పుడు వీరంతా కనిపించరని తెలిపారు. విభజన హామీలు నెరవేర్చాలన్నా, రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలన్నా అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. గతంలో దిల్లీ మెడలు వంచుతామని చెప్పిన వారంతా ఇప్పుడు అక్కడ మెకాళ్ల మీద కూర్చుకుంటున్నారని సత్యకుమార్ విమర్శించారు.