లోకేశ్​ క్షమాపణలు- మంచి సంప్రదాయాలకు తెరతీశారంటూ బీజేపీ నేత ప్రశంసంలు - BJP Leader Congratulate To Lokesh - BJP LEADER CONGRATULATE TO LOKESH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 8:06 PM IST

Minister Nara Lokesh Replied Thanking To BJP Leader Narasimha Rao : తన శాఖలో జరిగిన తప్పు కాకపోయినా పోలీసుల మితిమీరిన చర్యలకు మంత్రి లోకేశ్​ క్షమాపణ చెప్పటాన్ని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అభినందించారు. నిన్న కమ్యూనిస్ట్ నేతలను అరెస్టు చేయటంపై లోకేశ్​ క్షమాపణలు చెప్పినందుకు అభినందించారు. పోలీసుల మితిమీరిన చర్యలకు క్షమాపణ చెప్పి విద్యా శాఖలో అనేక ప్రభుత్వ పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టి రాజకీయాల్లో మంచి సంప్రదాయాలకు తెరతీశారంటూ ప్రశంసించారు. జీవీఎల్​కు ధన్యవాదాలు తెలుపుతూ లోకేశ్​ సమాధానం ఇచ్చారు. 

ప్రజల ఆశలు, ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి లోకేశ్​ స్పష్టం చేశారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు ఖచ్చితంగా జరుగుతాయని ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూడటమే నాయకుడి బాధ్యత అని తాను బలంగా నమ్ముతానని వెల్లడించారు. కూటమి నేతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసి ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని లోకేశ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.