అవాస్తవాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం : రామచంద్రరావు - BJP Ramachandra Rao On Congress - BJP RAMACHANDRA RAO ON CONGRESS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-04-2024/640-480-21313584-thumbnail-16x9-cong-charge.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 25, 2024, 5:39 PM IST
BJP Leader Ramachandra Rao Fires On Congress : బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీట్ విడుదల చేయడం పట్ల ఆ పార్టీనేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం గుర్తుపార్టీ దేశ వ్యతిరేక విధానాలను తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన దాంట్లో ఒక ఛార్జీ లేదు షీటు లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపడితే రాజ్యాంగం మారుస్తుందనే అవాస్తవ ప్రచారాలను కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం మార్చే అలవాటు హస్తం పార్టీదేనని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని ఆ పార్టీ ఎన్నిసార్లు మార్చిందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
తమ పార్టీకి రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని సంవిధానాన్ని ఎవరైనా మారిస్తే చూస్తూ ఊరుకోం అని కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ, అమిత్ షాలు తెలియజేసినట్లుగా రామచంద్రరావు వివరించారు. దేశంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంపై ఆయన ఎదురుదాడికి దాగారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హస్తం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంకా అమలు కాలేదన్నారు. మోదీ గ్యారంటీలు మాత్రం వందశాతం అమలవుతున్నాని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు రాహుల్వా, లేదా రేవంత్దా అని ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారం చేపట్టి 5 నెలలవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని రామచంద్రరావు విమర్శించారు.