పిల్ల కాంగ్రెస్ వదిలిన బాణం షర్మిల - ఆంధ్రా ప్రజలు తస్మాత్ జాగ్రత్త : దినకర్ - ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 7:50 PM IST
BJP Lanka Dinkar on APCC YS Sharmila Comments: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలపై బీజేపీ ప్రతిస్పందించింది. అన్నకు దన్నుగా వెనుక నుంచి రాజకీయాలు చేయడానికి కాదా? రాష్ట్రానికి వచ్చిందంటూ ధ్వజమెత్తింది. బీజేపీ రావణుడిని వధించిన రామబాణం అయితే, పిల్ల కాంగ్రెస్ వదిలిన బాణం ఆంధ్రా నుంచి తెలంగాణ వెళ్లి తుస్సుమందని బీజేపీ రాష్ట్ర శాఖ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. తెలంగాణలో తుస్సుమన్న ఆ బాణమే మళ్లీ తల్లి కాంగ్రెస్ పంచన చేరి కస్సుబుస్సు మంటోందని వ్యాఖ్యానించారు.
2019 ముందు ఆంధ్రాలో తిరిగిన ఈ బాణం మూలంగా రావణపాలనకు ఆద్యం అయిందని, శ్రీ రాముని బాణంతోనే 2024లో ఆంధ్రాలో రామరాజ్య స్థాపన జరగాలనేది బీజేపీ ఆకాంక్ష అని అన్నారు. నిన్న మొన్నటి వరకు తనకు ఆంధ్రాలో పని లేదని, ఇప్పుడు వచ్చిన పని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను ఏకం చేయడానికి కాదా? అంటూ వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. ఈ బాణం రాజకీయ ఉద్యోగం కోసం గతి తప్పి తిరుగుతోందన్న ఆయన ఆంధ్రా ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని వ్యాఖ్యానించారు.