కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజలకు 'గాడిద గుడ్లు'లా కనిపిస్తున్నాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి - Konda Vishweshwar Reddy Fires On CM - KONDA VISHWESHWAR REDDY FIRES ON CM
🎬 Watch Now: Feature Video
Published : May 3, 2024, 5:55 PM IST
Konda Vishweshwar Reddy Comments On CM Revanth : రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదు 'గాడిద గుడ్డు' ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమని బీజేపీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఐదు కిలోల ఉచిత బియ్యం గాడిద గుడ్డా? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు గాడిద గుడ్డా అని రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మహిళలకు రూ.2500 ఇస్తానని ఇవ్వలేదు, రైతుభరోసా రూ. 15వేలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు 'గాడిద గుడ్డు' అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి తనపైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని బలవంతంగా కలిపింది బలవంతంగా విడదీసింది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చదని సంవిధానాన్ని వందసార్లు మార్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పించేది బీజేపీ అని రిజర్వేషన్లు తీసేసేది కాంగ్రెస్ అన్నారు. అగ్ర కులాల పేదలకు బీజేపీ పది శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ కాదా అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి ముస్లిం, క్రిస్టియన్ ఓట్లతో గెలుస్తానంటున్నారు హిందువులు దేశంలోని ఓటర్లు కాదా అని ప్రశ్నించారు.