వెంకయ్య నాయుడిని కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా దంపతులు - padma Awards 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 3, 2024, 3:42 PM IST
Biotech Chairman Krishna Ella Meets Ex Vice President Venkaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక "పద్మవిభూషణ్" పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వెంకయ్య నాయుడుకు కలిసి అభినందనలు తెలియజేశారు.
వెంకయ్య నాయుడుకి పుష్పగుచ్ఛం అందజేసి దంపతులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపు ఇరువురు వెంకయ్య నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. మరోవైపు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెంకయ్య నాయుడును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకయ్య నాయుడికి పద్మవిభూషన్ పురస్కారం ప్రకటించిన వేళ ఆయనకు పలువూరు రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Padma Awards 2024 : ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి, సినీ నటుడు చీరంజీవికి పద్మవిభూషన్ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ముగ్గురు కళాకారులకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.