LIVE : బయో ఆసియా సదస్సు 2024లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - live
🎬 Watch Now: Feature Video
Published : Feb 27, 2024, 10:10 AM IST
|Updated : Feb 27, 2024, 11:00 AM IST
Bio Asia Summit in Hyderabad : హైదరాబాద్‌లో నిర్వహించే బయో ఆసియా 2024 సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఒక ట్వీట్‌ను ఎక్స్ వేదికగా చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించే బయో ఆసియా 2024 సదస్సుకు గ్లోబల్ లైఫ్ కంపెనీల అత్యంత ప్రభావవంతమైన నాయకులను స్వాగతిస్తున్నామని సీఎంఓ కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ క్షణం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. పరిశ్రమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రెడ్ కార్పెట్ పరుస్తున్నామని తెలిపారు. తెలంగాణను నూతన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తీర్చుదిద్దుతున్నామని పేర్కొంది. ఆదివారం ప్రారంభమైన బయో ఆసియా 2024 సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి 100 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.
Last Updated : Feb 27, 2024, 11:00 AM IST