ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన బైకర్ - చివరకు ఏమైందంటే? - Biker Attack On RTC Driver - BIKER ATTACK ON RTC DRIVER
🎬 Watch Now: Feature Video


Published : May 28, 2024, 9:54 PM IST
Biker Attack On RTC Driver : ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ వ్యక్తి చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ అటువైపుగా ప్రయాణిస్తున్న ఓ లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి బస్సుకు ఎదురుమార్గంగుండా వస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సు తనపైకే వస్తుందని భ్రమపడి, ఆగ్రహంతో ద్విచక్రవాహనాన్ని బస్సుకు ఎదురుగా నిలిపివేశాడు ఆ వ్యక్తి.
బస్సులోనికి ప్రవేశించిన అనిల్ డ్రైవర్ విజయేందర్‌పై విచక్షణారహితంగా చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఊహించని పరిణామానికి బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. కాగా దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా వారు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు సదరు వ్యక్తితో కలిసి అంతా పోలీసుస్టేషన్ వెళ్లారు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తిపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు.