అర్ధరాత్రి దడపుట్టిస్తున్న పోకిరీలు - నడిరోడ్డుపై డేంజరెస్ బైక్ స్టంట్స్​ - BIKE RACING AT HYD IT CORRIDOR - BIKE RACING AT HYD IT CORRIDOR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 11:28 AM IST

Bike Racing At Rayadurgam in Hyderabad : వీకెండ్స్ వస్తే చాలు హైదరాబాద్​లో యువత రెచ్చిపోతున్నారు. లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.  ఈ మధ్యకాలంలో హైదరాబాద్​లో రాత్రిపూట బైక్ రేసింగ్​లు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

అయితే స్టంట్లు చేసే వారిలో ఎక్కువగా టీనేజర్లు, మైనర్లు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజాగా శనివారం అర్ధరాత్రి రాయదుర్గం ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీగా బైక్ రేసింగ్​ జరిగింది. వాహనాల రాకపోకలకు మధ్య  బైకులపై స్టంట్లు చేస్తూ యువకులు హంగామా సృష్టించారు. అయితే తమ కళ్ల ముందే యువకులు ఇలాంటి ప్రమాదకర చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్ స్టంట్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.