మాస్ బీట్‌కు అదిరిపోయే స్టెప్పులు - భూపాలపల్లి జిల్లా ఎస్పీ డ్యాన్స్ వీడియో వైరల్ - BHUPALPALLY DISTRICT SP DANCE VIDEO - BHUPALPALLY DISTRICT SP DANCE VIDEO
🎬 Watch Now: Feature Video
Published : May 26, 2024, 2:50 PM IST
Bhupalpally SP Dance Viral Video : భూపాలపల్లి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో భూపాలపల్లిలోని ఇల్లందు గెస్ట్‌హౌస్‌లో పోలీసులు విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హుషారుగా డి.జే పాటలకు నృత్యం చేస్తూ సందడి చేశారు. ఎస్పీ డ్యాన్స్ చేయడాన్ని చూసిన సిబ్బంది డీఎస్పీలు , సీఐలు, ఎస్ఐ, ఇతర సిబ్బంది ఎస్పీ కిరణ్ ఖరేను ఎత్తుకొని ఉత్సాహంగా స్టెప్పులేశారు.
Bhupalpally SP Dance Video : ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసు అధికారులంతా ఇలా డ్యాన్స్ చేయడం పట్ల నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు వావ్ వాట్ ఏ డ్యాన్స్ అంటూ కామెంట్ చేస్తే మరి కొందరేమో సినిమా హీరోను మించి డ్యాన్సులేస్తున్నారంటూ తెగ పొగిడేశారు. కిరణ్ జీ మాస్ బీట్‌కు ఫాస్ట్ బీట్ స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్లతో నెట్టింట ఈ వీడియోను ట్రెండే చేస్తున్నారు.