భీమిలిలో ఖాళీ అవుతోన్న వైసీపీ క్యాడర్- మూకుమ్మడిగా రాజీనామా - Bhimili MPP Vasuraju

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 12:33 PM IST

Bhimili Mandal Parishad President Vasuraju Resign YCP in Visakha District : సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు వార్డులకు చెందిన వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా భీమిలి మండల పరిషత్​ అధ్యక్షులు దంతులూరి వాసురాజు అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు.

Bhimili MPP Vasuraju : అధికార పార్టీని స్థాపించినప్పటి నుంచి వైసీపీ అభ్యున్నతికి కృషి చేసినా తగిన గుర్తింపు లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నానని దంతులూరి వాసురాజు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్​ రావు(MLA Avanti Srinivas Rao) తనని అనునిత్యం అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సభలో తనను కించపరుస్తూ హేళనగా మాట్లాడేవారని వాపోయారు. ఎమ్మెల్యే అవంతి చేసే అవమానాలను తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యచరణను వెల్లడిస్తానని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.