ఖాదీ దుస్తులు ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించండి : కిషన్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Bharat Khadi House In Hyderabad : కేంద్ర ప్రభుత్వం ఖాదీ వస్తువులు, ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణ గూడలో ఏర్పాటు చేసిన భారత్ ఖాదీ హౌస్‌ను ఆయన ప్రారంభించారు. అనేక ఖాదీ పరిశ్రమలకు సబ్సిడీ కూడా పెంచినట్లు వెల్లడించారు. గతంలో కన్నా అమ్మకాలు కూడా పెరిగాయని ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఖాదీ వస్త్రాలను ధరించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వారానికి ఓ రోజు ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులను ధరించాలని కోరారు. కోట్లాది మంది చేనేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని అన్నారు.
Bharat Khadi House In Narayanguda : ఖాదీ బట్టలు ధరిస్తే ఆరోగ్యంగా, అందంగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఖాదీ వస్త్రాలు ధరించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కళలు కన్న ఆశయాలు నెరవేరుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఖాదీకి ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ వంటి ఎందరో మహానుభావులు పోరాటం చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. విదేశీ వస్తువుల బహిష్కరించడంతోఖాదీ, చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం దక్కిందని చెప్పారు.