ఏవోబీలో ఎలుగుబంటి హల్​చల్​ - అటవీ అధికారుల వాహనపై దాడి, పరుగులు తీసిన స్థానికులు - Bear Halchal Video Viral - BEAR HALCHAL VIDEO VIRAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 5:20 PM IST

Bear Halchal Video Viral in Andhra Odisha Border Area : ఆంధ్ర- ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని కోరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి గ్రామంలో ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ప్రైవేటు ఫాంహౌస్​లోకి వచ్చిన ఎలుగుబంటి అక్కడ పని చేస్తున్న వారిని పరుగులు పెట్టించింది. ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు అక్కడ ఉన్న ఓ ఇంటిపైకి ఎక్కారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి అటవీశాఖ అధికారుల వాహనం రావటం చూసిన ఎలుగుబంటి ఆ వాహనంపై దాడికి దిగింది.  

సుమారు 10 గంటలు శ్రమించిన అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని బంధించారు. ఈ క్రమంలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యేక బోనులో ఎలుగుబంటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి పెడతామని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలుగుబంటి వాహనంపై దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.