రామచంద్ర యాదవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు - విచారణ బుధవారానికి వాయిదా - high court orders to BCY Party
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 4:49 PM IST
BCY Party President RamaChandra Yadav Petition in High Court : తనపై చిత్తూరు జిల్లా సదుం పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. హత్యాయత్నం కేసులో బుధవారం వరకు పిటిషనర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా విచారణకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. మరో కేసులో 41ఏ నిబంధనలు అనుసరించాలని పోలీసులకు సైతం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదనాలు వినిపించారు. దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని వాదించారు. ఎన్నికల ప్రచారం చేయనీయకుండా నిలువరించేందుకే రామచంద్ర యాదవ్‌పై కేసు నమోదు చేశారని తెలిపారు. క్యాంపెయినింగ్ను ఎలా ఆపుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.
అయితే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సదూం మండలం యర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న బీసీవైపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు వేణుగోపాల్‌రెడ్డి వారితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. మంత్రి స్వగ్రామంలోనే ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ ఘర్షణకు దిగి కార్లు, ప్రచార రథలకు నిప్పు పెట్టారు.