రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులను వివరించడానికే జనహిత యాత్ర: బండి సంజయ్ - Bandi Sanjay Janahita Yatra
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 7:13 PM IST
Bandi Sanjay Interview on Janahita Yatra : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించిన వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే జనహిత యాత్ర చేపట్టినట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. అయిదు రోజులపాటు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జనహిత యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించి, ఇతర అవసరాలకు వినియోగించిందని దుయ్యబట్టారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి గత అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి తెలియజెప్పడమే కాకుండా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అటు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఇవాళ బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. మెనిఫేస్టోలో ప్రకటించిన హామీలన్నింటిని అమలు చేయాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలని, కేవలం 53,000 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసం పోయిందని దుయ్యబట్టారు.