LIVE : హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ - ప్రత్యక్ష ప్రసారం - Bandi Sanjay
🎬 Watch Now: Feature Video
Published : Feb 27, 2024, 1:26 PM IST
|Updated : Feb 27, 2024, 1:36 PM IST
Bandi Sanjay in Husnabad Prajahita Yatra Live : హుస్నాబాద్‌లో బండి సంజయ్ ప్రజాహిత యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం చిగురుమామిడిలో పర్యటించిన ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'అయోధ్యలో రామమందిరం కట్టారు, అక్షింతల పేరుతో రేషన్ బియ్యం పంచుతున్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని నమ్మకం ఏంటి అని పొన్నం అడుగుతున్నారు. అయితే నేనూ ఒకటి అడుగుతున్నానంటూ పొన్నంపై బండి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించగా, తాజాగా బండి సంజయ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. ఏదో అలజడి సృష్టించి, యాత్రను అడ్డుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నిలబెట్టాలని, ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే పొన్నం సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు.
Last Updated : Feb 27, 2024, 1:36 PM IST