వరుసగా పదోసారి పోటీలో అయ్యన్న - ప్రచారంలో కుటుంబ సభ్యులు - Ayyanna Family Election campaign - AYYANNA FAMILY ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 1:52 PM IST

Ayyanna Patrudu Family Members Election Campaign : సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయ్యన్నపాత్రుడు తరఫున ఆయన సతీమణి పద్మావతితో పాటు కోడళ్లు డాక్టర్ సువర్ణ, రెండో కోడలు దివ్య నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు వరుసగా పదోసారి అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలను కుటుంబ సభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నడూ లేని విధంగా అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు నియోజకవర్గంలోని మహిళలు, యువత తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే విధంగా మేల్కొలుపుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. 

అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ రంగంలో దిగటంతో బీజేపీ శ్రేణులు గ్రామాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని సీఎం రమేశ్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ తిరుగుతూ ఆయన వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వైసీపీ అమలు చేస్తున్నట్టుగా ప్రచారాలు చేస్తుండటాన్ని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.