కరీంనగర్లో ఆకట్టుకుంటున్న సైకత అయోధ్య రామమందిరం - Ayodhya Sand Art in Karimnagar
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2024, 7:58 PM IST
Ayodhya Sand Statue in Karimnagar : గత 500 ఏళ్లుగా యావత్ హిందూ సమాజం అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూసిన కల నేడు సాకారమైందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్బంగా కరీంనగర్ చైతన్యపురిలోని, మహాశక్తి ఆలయ ఆవరణలో సైకత శిల్పి వెంకటేశ్ అయోధ్య రామ మందిరాన్ని ఇసుకతో రూపొందించినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. దీన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Ayodhya Sand Sculpture in Karimnagar : రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఎంతోమంది దీక్షలు తీసుకున్నారని, ఇంటింటా రామ నామస్మరణ మారుమోగుతోందని తెలిపారు. రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా టపాసులు పేల్చి దీపావళి సంబరాలు చేసుకునే సందర్భమన్నారు. ప్రతి ఒక్కరు ఈ అయోధ్య రామమందిరాన్ని వీక్షించాలని సూచించిన బండి సంజయ్ కళాకారున్ని సన్మానించారు.