thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 7:23 PM IST

ETV Bharat / Videos

వేగంగా దూసుకొస్తూ మహిళను ఢీకొన్న ఆటో - సీసీ కెమెరాలో బయటపడ్డ డ్రైవర్​ నిర్లక్ష్యం

Auto Hit a Woman in Kukatpally : హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నిన్న చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్​బీలోని వసంత్​నగర్​లో అతివేగంతో వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పడంతో, రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యకుమారి అనే మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో, ఆమెను కిమ్స్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Be a road safety hero Awareness : మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న రహదారి ప్రమాదాలపై బీ ఏ రోడ్​ స్టేఫ్టీ హీరో నినాదంతో అధికారులు రోడ్​ సేఫ్టీ మంత్​ నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి తప్పెవరిదైనా ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారి ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.