రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆటోను జరపమన్నందుకు - ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి - Auto Driver Attack on RTC Bus
🎬 Watch Now: Feature Video


Published : Mar 8, 2024, 3:47 PM IST
Auto Driver Attack on RTC Bus at Khammam : ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడికి దిగి వీరంగం సృష్టించాడు. గోవింద్రాల గ్రామ సమీపంలో వెళ్తున్న బస్సుకు రోడ్డు మధ్యలో ఆటో అడ్డు రావడంతో, ఆటోను పక్కకు తీయమని ఆర్టీసీ బస్సు డ్రైవర్ కోరాడు. ఆగ్రహానికి లోనైన ఆటో నడుపుతున్న వ్యక్తి, బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. గొడవ పెద్దది కావడంతో కోపంలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కండక్టర్‌నూ కొట్టాడు.
అంతటితో ఆగకుండా ఒక నాపరాయితో ఆర్టీసీ బస్సు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. మరోవైపు, అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపై రాళ్లు విసరడంతో వారు భయాందోళన చెందారు. స్థానికులు ఆటో డ్రైవర్ బస్సుపై దాడి చేస్తున్న దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం అక్కడి నుంచి ఆటో డ్రైవర్ పారిపోయాడు. బస్సు డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు.