గంజాయి మత్తు ప్రాణాలు తీస్తోంది-నేరాలు చేయిస్తోంది - Youth Hit Another Person - YOUTH HIT ANOTHER PERSON
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 9:36 PM IST
Assault on Youth Under Influence of Ganja: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో ఓ యువకుడు గంజాయి మత్తులో మరో యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న మధ్యాహ్నం అల్లూరులోని సెటిల్మెంట్ కాలనీకి చెందిన జాన్‌పాల్, బానిపాల్, రంజిత్ ముగ్గురూ కలిసి రామతీర్థం బీచ్‌లో మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. బానిపాల్ మత్తులో బైక్‌ను వేగంగా నడుపుతుండటంతో వెనుకున్న జాన్‌పాల్ తలతిరుగుతుందని వాహనాన్ని ఆపమన్నాడు.
అతడు బైక్‌ను ఆపకుండా వేగంగా వెళుతుండటంతో జాన్‌పాల్ కోపంతో దూషించాడు. దీంతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం జాన్‌పాల్‌ను ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఈ విషయం ఆలస్యంగా ఇంట్లో వాళ్లకి తెలియడంతో వెంటనే అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తులో యువకుడిపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.