ఆశా వర్కర్స్ ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం - నిజయవాడలో ఆశా వర్కర్స్ ఆందోళ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 1:30 PM IST
|Updated : Feb 8, 2024, 1:50 PM IST
Asha Workers Protest in vijayawada : కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ చేపట్టిన ఆందోళపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనలో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్తున్న ఆశా వర్సర్స్ను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆరెస్ట్ చేసిన ఆశా వర్కర్లను మచిలీపట్నంలోని పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆశా వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Asha Workers Protest in Andhra Pradesh : అల్పాహారం కూడా పెట్టకుండా ఉదయం నుంచి తమను బస్సుల్లో తిప్పుతున్నారని వాపోతున్నారు. తమలో బీపీ, షూగర్ ఉన్నవారు ఉన్నారని, వారికి ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏఎన్ఎంలు చేయాల్సిన పనులు తమతో చేయిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 10 వేలు వేతనం సరిపోవడం లేదని, ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయో ప్రభుత్వానికి తెలియడం లేదా అని మండిపడుతున్నారు. తమకు కనీస వేతనం చెల్లించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.