హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించడం ఎవరి తరం కాదు : అసదుద్దీన్ ఒవైసీ - Asaduddin Owaisi slams bjp - ASADUDDIN OWAISI SLAMS BJP
🎬 Watch Now: Feature Video


Published : Jul 27, 2024, 6:46 PM IST
Asaduddin Owaisi slams BJP : హైదరాబాద్‌కు కేంద్రం నుంచి మోదీ వచ్చినా, అమిత్ షా వచ్చినా ఎవరూ ఎంఐఎం పార్టీని ఓడించలేరని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇవాళ కొడంగల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 సంవత్సరాలుగా ముస్లింలపై దేశవ్యాప్తంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం ప్రజలపై అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎంఐఎం పార్టీని ఓడించడానికి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ షా, నరేంద్ర మోదీ ఎన్నోసార్లు హైదరాబాద్‌కు వచ్చి ప్రచారం నిర్వహించినా తనను ఓడించడం వారి వల్ల కాలేదని అన్నారు. ఎంఐఎం పార్టీ అంటే కేవలం ముస్లిం పార్టీ కాదని, అన్ని వర్గాల పేద ప్రజలకు సంబంధించిన పార్టీ అని అన్నారు. తాను అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు.