LIVE: బద్వేల్ నియోజకవర్గ పరిధిలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం- ప్రత్యక్షప్రసారం - Sharmila Election Campaign - SHARMILA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-05-2024/640-480-21357957-thumbnail-16x9-apcc-chief-ys-sharmila-election-campaign-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 11:50 AM IST
APCC Chief YS Sharmila Election Campaign Live: రాష్ట్రంలో ఇవి న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మంగళవారం మాట్లాడిన ఆమె ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కుమారుడై ఉండి తండ్రి పేరును జగన్ దుర్మార్గంగా ఛార్జ్‌షీట్‌లో చేర్పించారని ధ్వజమెత్తారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదన్న ఆమె, ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేకపోతే ఇప్పుడు ఏఏజీగా ఉన్న సుధాకర్‌రెడ్డే చేర్పించారన్నారు. వైఎస్ పేరు లేకుంటే కేసు నుంచి జగన్ బయటపడటం అసాధ్యమనే ఉద్దేశంతోనే కేసు వేశారని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ కోర్టుల్లో పిటిషన్లు వేయించారని, సుధాకర్‌రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చిందని తెలిపారు. కన్నతండ్రి పేరును దుర్మార్గంగా జగనే ఛార్జ్‌షీట్‌లో చేర్పించారని ధ్వజమెత్తారు. కాగా వైఎస్సార్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గం పరిధిలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రత్యక్షప్రసారం మీకోసం.