సెలబ్రిటీనే బెదిరించారు - సామాన్యుల పరిస్థితి ఏంటి? : ఏపీ ప్రొఫెషనల్ ఫోరం - AP Professional Forum - AP PROFESSIONAL FORUM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 7:30 PM IST

AP Professional Forum on Mumbai Actress Case: ఉన్నత చదువులు చదువుకున్న వైద్యురాలు, సినీనటి జిత్వానికి జరిగిన అన్యాయం గమనిస్తే ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నామనేది అర్థమవుతుందని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులతో పరిచయం ఉన్న జిందాల్ మన రాష్ట్రాన్నే ఎంచుకోవడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. ఒక సెలబ్రిటీ, అదీ ఉన్నత స్థాయి నాయకులకే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కష్టంగా ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన పోలీసులు గూండాలు చేసే సెటిల్​మెంట్​ తరహా ఉద్యోగం చేయడం అంటే సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. ఒత్తిళ్లకు లోనై రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం చేయలేనప్పుడు ఉద్యోగాలకు రాజీనామా చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే అధికారులు, వ్యవస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.