LIVE: తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైఎస్ షర్మిల- ప్రత్యక్ష ప్రసారం - AP PCC Chief Sharmila Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 12:06 PM IST
AP PCC Chief Sharmila Live: అధికార వైఎస్సార్సీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి వివిధ జిల్లాలో పర్యటనలు చేస్తున్న ఆమె, శనివారం ప్రకాశం జిల్లాలో కార్యకర్తల సమావేశంలో వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ పార్టీకి షర్మిల కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ పార్టీ పేరుకు గతంలో ఉన్న అర్థం వేరని, ఇప్పుడున్న అర్థం వేరంటూ విమర్శించారు. ఇప్పుడున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమేనని ఆమె అభివర్ణించారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ షర్మిల పాల్గొనగా, సీనియర్ నాయకులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. పులి కడుపునా పులే పుడుతుందని, తనలో ప్రవహిస్తోంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తమని షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఎవరూ ఏం చేయలేరని ఆమె తేల్చి చెప్పారు. కాగా ఈరోజు తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల ప్రత్యక్షప్రసారం.