ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీవో నిరంతరం పోరాటం చేస్తుంది: శివారెడ్డి - AP NGO Siva Reddy visit kadata
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 9:10 PM IST
AP NGO Association President Siva Reddy on Employees Issues : ఉద్యోగుల సమస్యల పరిష్కార కోసం నిరంతరం పోరాటాలు చేస్తుంటామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. ఉద్యోగులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వాటిలో కొన్ని ఆర్థికపరమైన అంశాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు.
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులుగా శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన మొదటి సారిగా వైఎస్సార్ కడప జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కడపలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఇరిగేషన్ కార్యాలయం నుంచి మొదలై ర్యాలీ జడ్పీ సమావేశ మందిరం వరకు కొనసాగింది. ఉద్యోగులు డప్పులు వాయిస్తూ టపాసాలు కాల్చుతూ ర్యాలీ చేపట్టారు. పెండింగ్లో ఉన్న రెండు డీఎల్లను మంజూరు చేయాలని కోరగా ఒక డీఏ ఇస్తామని చెప్పారని శివారెడ్డి తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీవో నిరంతరం పోరాటం చేస్తుందని శివారెడ్డి స్పష్టం చేశారు.