'దళితులపై దాడులు, హత్యలు చేసిన వారికి జగన్ పదవులు కట్టబెట్టడం దుర్మార్గం' - టీడీపీకి ఎమ్మార్పీఎస్ మద్దతు - AP MRPS Support To NDA Alliance - AP MRPS SUPPORT TO NDA ALLIANCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 7:32 PM IST
AP MRPS Support To NDA Alliance : దళితులపై దాడులు చేసి హత్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అలాగే ఉంచడం గమనిస్తే ఆయనకు దళితులపై ఏమాత్రం ప్రేమ ఉందనేది స్పష్టం అవుతుందని ఏపీ ఎమ్మార్పీఎస్ సభ్యులు ధ్వజమెత్తారు. దళితులను హత్యలు చేసిన ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులను అలాగే ఉంచడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో మనమందరం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి దళితులపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలని ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సంజయ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వాల కంటే వైఎస్సార్సీపీ సర్కార్ లోనే అత్యధికంగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో జత కట్టడం వల్ల వర్గీకరణ సులభ సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ దళితులకు సంబంధించిన రుణాలు అన్నిటిని దారి మళ్లించి దళితులను నిలువునా మోసం చేశారని విమర్శించారు.