LIVE: శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం - LEGISLATIVE COUNCIL SESSIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 10:12 AM IST

Updated : Nov 22, 2024, 2:35 PM IST

AP Legislative Council Sessions Live : తొమ్మిదో రోజు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ గురువారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రివెన్షన్‌ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మునిసిపల్‌ లా బిల్లును పురపాలకశాఖ మంత్రి నారాయణ, వస్తు, సేవల సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లును హోంమంత్రి అనిత, హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు బిల్లును మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. వీటిపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది. ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లులో ఇసుక అక్రమ రవాణా, బియ్యం బ్లాక్‌ మార్కెటింగ్‌కు తరలింపునకు అడ్డుకట్ట వేయడాన్ని అప్పటికప్పుడు పొందుపరుస్తూ హోంమంత్రి అనిత ప్రతిపాదించారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం మీకోసం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Nov 22, 2024, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.