డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం - 11న ఉద్యమ కార్యాచరణ: బండి శ్రీనివాసరావు - ఏపీజేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 7:19 PM IST

AP JAC Chairman Bandi Srinivasa Rao: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ఈ నెల 11న ఏపీజేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని, ఆ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 12వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేయనున్నట్లు బండి శ్రీనివాసరావు వివరించారు. 

ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు సైతం వెనకాడబోమని బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగులకు జీపీఎఫ్ పూర్తిగా సకాలంలో అందడం లేదని, తాము దాచుకున్న మొత్తాన్ని కూడా సకాలంలో అందుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓపీఎస్ అమలు కావడం లేదన్న ఆయన, ఒకటో తేదీన జీతం, ఫించన్ ఖచ్చితంగా అందుకుంటామనే నమ్మకం లేదని వాపోయారు. వీటిపై ప్రతి ఉద్యోగి ఆందోళనలో ఉన్నాడని వెల్లడించారు.    

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.