ఏపీ హైకోర్టులో మరో ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు- ఆమోదం తెలిపిన రాష్ట్రపతి - Elevation of 3 judges of High Court

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:00 PM IST

Ap High Court Judges Elevated As Permanent Judges: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా చేస్తున్న జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు, మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఏపీ హైకోర్టు కొలీజియం 2023 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు కొలీజియానికి ప్రతిపాదించింది. దాన్ని పరిగణనలోకి తీసుకొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Chief Justice DY Chandrachud ) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఏపీ హైకోర్టులో ఉన్న శాశ్వత న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య ఆధారంగానే జస్టిస్‌ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్‌ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.