డిమాండ్లు పరిష్కరించని ఏ ప్రభుత్వమూ తిరిగి అధికారంలోకి రాలేదు: ప్రభుత్వ ఉద్యోగులు - apjac leaders agitation

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 3:56 PM IST

AP Employees Agitation in Vijayawada : ఏపీ జేఏసీ పిలుపు మేరకు  విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. పెండింగ్ బకాయిలు, వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రూ.20 వేల కోట్లకు పైగా బకాయిలు ఉందన్నారు. చివరకు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ వంటి క్లెయిమ్‌లను సైతం ప్రభుత్వం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ చెందిన వారి ప్రయోజనాలు చెల్లింపులోను తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. 

Apjac Leaders Concerns : ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు, జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించని ఏ ప్రభుత్వం కూడా తిరిగి అధికారంలోకి రాలేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 15, 16న అన్నీ మండల కేంద్రాల్లో భోజన విరామ సమయంలో నిరసన తెలియజేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 27న చలో విజయవాడకు అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.