వారి సేవలు ఇక అవసరం లేదు- కొత్త ప్రభుత్వం కీలక ఆదేశాలు - AP CS Orders on Retired Employees - AP CS ORDERS ON RETIRED EMPLOYEES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 20, 2024, 7:00 PM IST
AP CS Orders to Remove Retired Employees who are Still Working: రిటైరైనా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. వారందరినీ తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ (AP CS Nirab Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాల్లో రిటైర్డైన కొందరు ఉద్యోగులను కొనసాగించారు. వీరి సేవలపై ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరు వెంటనే రాజీనామాలు సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 24వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదికివ్వాలని ఆదేశించింది.
సీఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగులు: తెలంగాణకి చెందిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారని, వారిని తమ రాష్ట్రానికి పంపాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల రిలీవ్‌పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు.