LIVE : తిరుమల శ్రీవారి సేవలో ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CHANDRABABU AT TIRUMALA LIVE - AP CM CHANDRABABU AT TIRUMALA LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 8:04 AM IST
|Updated : Jun 13, 2024, 8:14 AM IST
Chandrababu Visit Tirumala Live : తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం చంద్రబాబు కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల వెళ్తూ తిరుపతిలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద వాహన శ్రేణి ఆపి కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లారు. రాత్రి 8:45 గంటల సమయంలో తిరుమలలోని శ్రీగాయత్రి నిలయానికి చేరుకున్నారు. ఆయన వెంట భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్ వచ్చారు. రాత్రి అక్కడే బసచేశారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు. ఆయన వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు టీటీడీ ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం యత్నించగా సీఎం తిరస్కరించారు.
Last Updated : Jun 13, 2024, 8:14 AM IST