LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2024, 9:05 AM IST
|Updated : Nov 14, 2024, 5:46 PM IST
AP Assembly Sessions Live : మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024తోసహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది. వీటితోపాటు ఏపీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులను కూడా అనుమతిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును మరో మంత్రి నారాయణ శాసనసభ ముందు ఉంచారు. వీటిని అసెంబ్లీ ఆమోదించింది. మరోవైపు అదేవిధంగా యుద్ధప్రాతిపదికన డీఎస్సీ-2024 నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నామని చెప్పారు.
Last Updated : Nov 14, 2024, 5:46 PM IST