ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు? - AP Assembly Meetings - AP ASSEMBLY MEETINGS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 9:23 PM IST

AP Assembly Meetings are likely to be held from 22nd of this Month : ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థికశాఖ తర్జనభర్జనలు పడుతోంది. ప్రస్తుతమున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే (Oton Account Budget) కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగు నెలల పాటు ఓటాన్‌ అకౌంట్‌ కోసం ఆర్డినెన్స్‌ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొంచెం ఆర్థిక వెసులుబాటు వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అన్ని విషయాలపై పూర్తి స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థికశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఆర్డినెన్స్‌ పెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థికశాఖ ఎదురు చూస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.