LIVE: హైదరాబాద్‌లో డా. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు - ప్రత్యక్షప్రసారం - ANR 100th Birth Anniversary LIVE - ANR 100TH BIRTH ANNIVERSARY LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/640-480-22497947-thumbnail-16x9-anr.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2024, 5:45 PM IST
|Updated : Sep 20, 2024, 6:19 PM IST
ANR 100th Birth Anniversary Live : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, ప్రముఖ సినీనటుడు దివంగత డా.అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్కే సినీ ప్లెక్స్‌లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు తనయుడు, సినీ హీరో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారితో పాటు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ శత జయంతి వేడుకల కార్యక్రమానికి వచ్చారు.తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మహా నటుడే కాదని, గొప్ప మానవతావాదని నాగార్జున కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణమని అన్నారు. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా గత రెండ్రోజుల నుంచి నగరంలో డా.అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి మహోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురి ప్రముఖులకు డా.అక్కినేని నాగేశ్వరరావు ఆత్మీయ పురస్కారాలను అందజేశారు.
Last Updated : Sep 20, 2024, 6:19 PM IST