ఆంజనేయస్వామి రథోత్సవంలో అపశృతి - ఒక్కసారిగా కూలిన రథం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 11:10 AM IST
Anjaneya Swamy chariot Collapsed : అనంతపురం జిల్లాలో ఆంజనేయస్వామి ఆలయ రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఈ ప్రదేశానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా రథోత్సవ కార్యక్రవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ అపశృతిలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
Anjaneya Swamy Rathotsavam at Kundurpi : జిల్లాలోని కుందుర్పి మండలం అప్పిలేపల్లి ఆంజనేయస్వామి రథోత్సవంలో పెను ప్రమాదం తప్పింది. అప్పిలేపల్లి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే ఆంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారు జామున రథం లాగుతుండగా అపశృతి చోటు చేసుకుంది. ఆలయ సమీపానికి వెళ్లే సమయంలో రథం ఒక్కసారిగా పక్కకు కూలిపోయింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన భక్తులు, గ్రామస్థులు ఒక్కసారిగా అరుపులతో పరుగులు తీశారు. ఎత్తైన రథం విరిగి కూలిపోయినా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రథం ముందు భాగంలో పువ్వుల బరువు అధికంగా ఉండటం, వేగంగా రథాన్ని లాగటం వల్ల అపశృతి జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.