'అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది' - Anganwadi Workers Fires On YSRCP - ANGANWADI WORKERS FIRES ON YSRCP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-07-2024/640-480-21906950-thumbnail-16x9-anganwadi-workers-fires-on-ysrcp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 5:56 PM IST
Anganwadi Workers Fires On YSRCP : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్వాడీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రజా ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు.
Anganwadi Workers and Helpers Association Demands : గత ఐదు సంవత్సరాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లలిత మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, మినీ సెంటర్లు అన్నింటిని మెయిల్ సెంటర్లుగా ప్రకటించాలని కోరుతూ నేడు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పైన స్పందించి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.