ఉచిత బస్సు సౌకర్యం కల్పించండి - సీఎం చంద్రబాబుకు దివ్యాంగుల వినతి - Divyang People Met CM Chandrababu - DIVYANG PEOPLE MET CM CHANDRABABU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 5:21 PM IST
Anantapuram Divyang People Met CM Chandrababu : మహిళలకు ప్రభుత్వం అమలు చేయబోయే ఉచిత బస్సు సౌకర్యాన్ని తమకూ వర్తింపజేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. అనంతపురానికి చెందిన దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం (Divyang People petition to CBN) అందించారు. పెన్షన్‌ను 6 వేల రూపాయలకు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో దివ్యాంగులకు కేటాయించిన రీహాబిలిటేషన్ సెంటర్ను పునరుద్ధరించాలని కోరారు. తమ కోసం ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించాలని కోరారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛను ఇస్తామని గతంలో చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంతే కాకుండా వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని స్పష్టం చేశారని అన్నట్లుగానే చంద్రబాబు తమను ఆదుకున్నారని దివ్యాంగులు అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.