LIVE నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ- ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Anam press meet live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2024, 4:19 PM IST
|Updated : Sep 19, 2024, 4:34 PM IST
Anam Venkata Ramana Reddy media conference: వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిన NDDB CALF ల్యాబ్. జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా జులై 17న నివేదిక ఇచ్చిన NDDB CALF ల్యాబ్ ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైసీపీ బండారం బట్టబయలైంది. నెయ్యి కొనుగోళ్ళులో ఎటువంటి నాణ్యత పాటించలేదు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రపై పలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దీంతో వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆధారాలతో నిరూపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి. ప్రత్యక్షప్రసారం
Last Updated : Sep 19, 2024, 4:34 PM IST