LIVE : సికింద్రాబాద్ బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా - Amit Shah campaign in TS live - AMIT SHAH CAMPAIGN IN TS LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 4:37 PM IST
|Updated : May 5, 2024, 8:18 PM IST
Amit Shah Live : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తొలుత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాగజ్‌నగర్‌కు ఆయన చేరుకున్నారు. అక్కడ ఆదిలాబాద్ కమలం పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోడెం నగేష్‌కు మద్దతుగా ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభ అనంతరం నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం అమిత్ షా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు.
Last Updated : May 5, 2024, 8:18 PM IST