భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి పేరును పరిశీలిస్తాం: పల్లా శ్రీనివాసరావు - Alluri Sitarama Raju 127 birthday - ALLURI SITARAMA RAJU 127 BIRTHDAY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 5:21 PM IST
Alluri Sitarama Raju 127th Birth Anniversary Celebrations : స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ సాగర్ తీరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ ప్రాంత వీరుడుగా అల్లూరి సీతారామరాజు చూపించిన తెగువ ధైర్య సాహసాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి అల్లూరికి అంజలి ఘటించారు. రాజీలేని పోరాటం ద్వారా ఆయన బ్రిటిష్ వారిని వెళ్లగొట్టగలిగారని ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడమే అతనికి ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు నేతలు చెప్పారు. అల్లూరి వారసత్వం తెలుగువారికి శాశ్వతంగా గుర్తుండిపోయేలా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితమని నేతలు మద్దతు పలికారు.