ఆటల్లో గెలుపు ఓటములు సహజమే - క్రీడా స్ఫూర్తిని చాటాలి - Anantapur Adudam Andhra Program
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 3:41 PM IST
Adudam Andhra District Level Sports Started by the District Collector Ashok Babu : 'ఆడుదాం ఆంధ్ర' జిల్లా స్థాయి క్రీడాలను పుట్టపర్తి సూపర్ హాస్పిటల్ సమీపంలో అనంతపురం జిల్లా కలెక్టర్ అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే అని, క్రీడా స్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన టీమ్లు రాష్ట్ర స్థాయిలో ఆడుతారని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాలని కోరుకున్నారు. అనంతరం జిల్లా క్రీడాకారులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో సరదాగా ఆటలు ఆడారు.
Adudam Andhra Program in Anantapur District : ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఐదు రంగాల్లో క్రీడా పోటీలను నిర్వహింస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలకు నగదు ప్రధానం చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో పాల్గోనే వారు విజయం సాధించాలని ఆశించారు.