మన్యంలో ఉద్యోగాలన్ని తమకే ఇవ్వాలి- జీవో నెం. 3 ను రద్దు చేయాలి: గిరిజన సంఘాలు ఆందోళన - Tribals protest on DSC notification
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 10:03 PM IST
Adivasi Tribal Community Protest in Buttaigudem: గిరిజనులకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఆదివాసి గిరిజన సంఘం (Adivasi tribal community) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మన్యం ప్రాంతాల్లో స్పెషల్ డీఎస్సీ (DSC Notification in AP) నిర్వహించాలని అంతే కాకుండా గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన్యం ప్రాంతాల్లోని ఉద్యోగాలను నూరు శాతం ఆదివాసీలకే ఇవ్వాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. మన్యం ప్రాంతాల్లో 517 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆదివాసీలకు కేవలం 38 ఉద్యోగాలను కేటాయింటి గిరిజనులను సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 3ని రద్దు చేసి గిరిజనులకు జగన్ అన్యాయం చేస్తే గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజనుల బంద్ నేపథ్యంలో దుకాణాలు మూతపడటంతో పాటు రాకపోకలు నిలిచిపోయాయి.