ఆదివాసీ గూడాల్లో హోలీ పండగ - మోదుగ పూలతో తయారు చేసిన రంగులతో సంబరాలు - Adilabad Adivasi Holi Celebrations - ADILABAD ADIVASI HOLI CELEBRATIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 12:59 PM IST

Adilabad Adivasi Holi Celebrations : అన్ని పండుల్లో ప్రత్యేకమైన పండుగ హోలీ. ఈ సంబురాలను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని గిరిజనులు విభిన్నంగా జరుపుకుంటారు. తమతమ ఆచారాలకు అనుగుణంగా నిర్వహించడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటిస్తూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు.హోలీ పండుగ సందర్భం గా ఆదివాసీ గూడెంలలో పండుగ వాతావరణం నెలకొంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, కెరమెరి, తిర్యాని మండలాల్లో ఆదివాసులు ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మోదుగ పూలతో రంగులు తయారుచేసి హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు.

Adivasi Holi Festival In Adilabad : హోలీ పండుగను పురస్కరించుకుని ఆదివాసీలు మోదుగ పూలను పూజల్లో వినియోగించడంతో పాటు మోదుగ పూలతో రంగులు తయారు చేసి స్వచ్చమైన పూల రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. వెధురు కర్రలకు పూజలు చేసి ఆపై అందరిలా కామ దహనం చేస్తారు. పూర్వకాలం నాటి వైభవాలను సాంస్కృతి సాంప్రదాయాలను నేటికి పాటిస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. బయట మార్కెట్లో లభించే కెమికల్ రంగులను వాడకుండ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.