'సోలార్ విద్యుత్ వల్ల గృహ వినియోగదారులకు ఎన్నో లాభాలు' - Adani Solar panel news
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 2:21 PM IST
Adani Solar Panel Launch In Hyderabad : సోలార్ విద్యుత్ వల్ల గృహ వినియోగదారులకు ఎన్నో లాభాలున్నాయని, అవసరానికి తగిన విద్యుత్ వినియోగించుకొని, మిగులు మొత్తాన్ని డిస్కంలకు విక్రయించొచ్చని టీఎస్ రెడ్కో ఎండీ జానయ్య అన్నారు. పర్యావరణానికి మేలు చేకూర్చే సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ సైతం ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అదానీ సోలార్ కంపెనీ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న నూతన సోలార్ ప్యానెళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు. సోలార్ విద్యుత్ వాడటం వల్ల కరెంట్ బిల్లు తగ్గుతుందని జానయ్య అన్నారు. జిల్లాలలో సోలార్ వ్యాపారం విస్తృతంగా వ్యాపిస్తుందని తెలిపారు.
Adani Solar Panels MD Janaiah : తొలిసారి 570వాట్ల సోలార్ ప్యానెల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు అదానీ సోలార్ మార్కెటింగ్ హెడ్ సెసిల్ అగస్టీన్ పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన కోటి గృహాలకు సోలార్ విద్యుత్ పథకం ఎంతో ఉపయోగకరమైనది. దీనివల్ల గ్రామాలకు సైతం సోలార్ విద్యుత్ విస్తరిస్తుందని సెసిల్ అగస్టీన్ తెలిపారు.