విజయవాడలో శ్రీలీల సందడి - తరలివచ్చిన అభిమానులు - Actress Sreeleela in Vijayawada - ACTRESS SREELEELA IN VIJAYAWADA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-09-2024/640-480-22559492-thumbnail-16x9-sreeleela-in-vijayawada.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 3:53 PM IST
Actress Sreeleela in Vijayawada : విజయవాడలో సినీనటి శ్రీలీల సందడి చేశారు. ఎంజీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను యాజమాన్యంతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అనంతరం స్టోర్‌లో కలియ తిరుగుతూ పలు వస్త్రాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్‌కు భారీగా తరలివచ్చారు.
Sreeleela Opened Shopping Mall Vijayawada : శ్రీలీల రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ వినియోగదారులను కట్టిపడిసే విధంగా ఉందని శ్రీలీల తెలిపారు. విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అధునాతన కలెక్షన్స్, నూతన వెరైటీలతో అతిపెద్ద స్టోర్‌గా చెన్నయ్ షాపింగ్ మాల్ అవతరించిందని చెప్పారు. ముందస్తుగా ప్రజలందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్ధసారథి, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.